నలుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ – బంగారం, వాహనాలు, మొబైల్స్ స్వాధీనం
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 21
కామారెడ్డి జిల్లాలో దొంగల గ్యాంగ్ గజగజలాడింది. కొన్ని నెలలుగా పలు జిల్లాల్లో దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో నేరాలకు పాల్పడిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి మూడు తులాల బంగారు పూసతాడు, రెండు కార్లు, ఒక బైక్, మొబైల్స్ సహా పలు ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 26న భిక్నూర్ గ్రామంలోని బాయ్స్ హైస్కూల్ సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వెళ్లి ‘లోన్ ఇప్పిస్తా’ అంటూ నమ్మించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు పూసతాడు అపహరించిన ఘటనతో ఈ కేసు బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు భిక్నూర్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 65/2025 U/s 318(2), 303(2) BNS కింద కేసు నమోదు అయ్యింది.
ఎస్పీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, ఏఎస్‌పి B. చైతన్యారెడ్డి IPS పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, క్రమపద్ధతిలో దర్యాప్తు జరిపి నిందితుల జాడ కనుగొన్నారు. టోల్‌గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు పలు జిల్లాల్లో మరో 8 దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
🚔 అరెస్టయిన నిందితులు
A1: ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ (43), మహారాష్ట్ర – ఈయనపై తెలంగాణలో గతంలోనే 60 దొంగతనాల కేసులు ఉన్నాయి.
A2: ఫహీమాబేగం (35), మహారాష్ట్ర
A3: కబీరుద్దిన్ షేక్ (43), నాగపూర్ – బంగారు ఆభరణాల వ్యాపారి
A4: దీపక్ సలుంకే (54), నాగపూర్ – బంగారు పరీక్షల దుకాణం యజమాని
🛑 స్వాధీనం చేసిన ఆస్తి
మూడు తులాల బంగారు పూసతాడు.
రెండు కార్లు – టాటా సఫారీ, మారుతి సుజుకి SX4
ఒక పల్సర్ బైక్ (ఫేక్ నంబర్ ప్లేట్‌తో)
నాలుగు మొబైల్ ఫోన్లు
📍 ఒప్పుకున్న నేరాలు
అదిలాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు మొత్తం 8 కేసులు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో బంగారు పూసతాళ్లు, గొలుసులు, చెవిపోగులు, నగదు దొంగిలించినట్లు అంగీకరించారు.
👮♂️ కేసు ఛేదించిన పోలీసులు
భిక్నూర్ సీఐ M. సంపత్‌కుమార్, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ N. శ్రీనివాస్, ఎస్‌ఐ D. ఆంజనేయులు, ఎస్‌ఐ ఉస్మాన్, ఏఎస్‌ఐ వెంకట్రావ్, కానిస్టేబుళ్లు రజనీకాంత్, రాములు, కిషన్ గౌడ్, రవి, రాజేందర్, మైసయ్య, రమేష్ యాదవ్, మేకల నరేష్, నరేష్‌కుమార్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
🚨 ప్రజలకు ఎస్‌పి విజ్ఞప్తి
అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.