..ముస్తఫానగర్ గ్రామ శివారులో పేకాట రాయుళ్ల అరెస్టు..
(గంభీరావుపేట డిసెంబర్ 26)
ముస్తఫానగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో ముస్తఫానగర్ లోని బట్టల చెరువు ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 8850 నగదు నాలుగు చరవానులు మూడు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ శ్రీకాంత్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు ఎస్సై మాట్లాడుతూ మండలంలోపేకాట ఆడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు