ఆలయాల దొంగల అరెస్ట్ రిమాండ్.
ప్రశ్న ఆయుధం, జనవరి 16
కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 4 లక్షల విలువ గల వస్తువులను స్వాదీనపరుచుకునట్టు కామారెడ్డి ఎ ఎస్పీ చైతన్య తెలిపారు. గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎ ఎస్పీ చైతన్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైతన్య రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోని ఐదు గుళ్ళల్లో, సాయి బాబా ఆలయంలో, భిక్కనూర్ లోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు నిమ్మలవోయిన సురేష్, రుద్రబోయిన గణేష్, గాజుల శ్రీధర్ లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరు కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూర్, రామారెడ్డి, ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరిగిన 11 దొంగతనాలు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుండి 4 లక్షల విలువ గల మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటో, రెండు మైక్ సెట్ లను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాదీనం చేసుకుని నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని ఎ ఎస్పీ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై లు పాల్గొన్నారు.