ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు.
నిజామాబాద్ జనవరి27

చేయడానికి అంగవైకల్యం అడ్డు కాదని ఓ దొంగ నిరూపించారని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో వరుస బైక్ ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్తులను పట్టుకున్నట్లు విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఏసీపీ అందించిన వివరాల ప్రకారం తాడెం అనిల్ కుమార్,ద్యావంగుల సంతోష్,వొల్లెపు గోపి లు మద్యం కు బానిసలై,జల్సాలకు పోయి నగరం లో వరుస బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్నారని,పాలిటెక్నీక్ కళాశాల ముందు పార్క్ చేసిన బైకు దొంగతనం కావడంతో ఫిర్యాదు దారుడు మూడో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కం కంటేశ్వర్ ప్రాంతంలో మూడో పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబు,సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి వారిని చూసి బైకు పై పారిపోతుండగా పట్టుకొని విచారించగా సదరు వ్యక్తి చెవిటి,మూగ కావడంతో సైగల ద్వారా వివరాలు అడగగా జల్సాల కోసం తాను బైక్ లు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.దొంగలను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన సిఐ,ఎస్సై హరిబాబు,సిబ్బందిలను అభినందించి రివార్డు కొరకు సిపి కి నివేదిస్తామన్నారు.
Post Views: 20