ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్చిలకలూరుపేట పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపిన అర్బన్ సీఐ రమేష్ తెలిపారు.అర్బన్ సీఐ రమేష్ చెప్పిన వివరాల ప్రకారంవాహనాలు తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఒక స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించారు.పోలీసులు వారిని పట్టుకుని విచారించగా, వారి పేర్లు పోలాస్ ఉదయకిరణ్ (పురుషోత్తంపట్నం), కొడవతు జశ్వంత్ నాయక్, మరియు కొడవతు బాలస్వామి నాయక్ (వీరిద్దరూ చిలకలూరుపేట టౌన్, సుగాలి కాలనీకి చెందినవారు) అని తెలిసింది. వీరు ముగ్గురు చెడు అలవాట్లకు బానిసలై, మద్యం మరియు గంజాయి తాగడం వంటి వ్యసనాలకు డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారని విచారణలో వెల్లడైంది.చిలకలూరుపేట టౌన్, వెలకాని, తెనాలి ప్రాంతాల్లో సుమారు 11 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. అందులో చిలకలూరుపేటకు చెందిన 6 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్, ఒక ఎంటీ బైక్ ఉన్నాయి. తెనాలికి చెందిన ఒక స్కూటీ, వెలకాని కి చెందిన ఒక బుల్లెట్ ను కూడా దొంగిలించారు.దొంగిలించిన వాహనాలను నరసరావుపేట రోడ్డులోని దబ్బలగూడెం దగ్గర ఒక ముళ్ళపొదల ప్రదేశంలో దాచి, అవసరమైనప్పుడు ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ 11 బైకులను రికవరీ చేశారు.చివరగా, చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. నేరాలు జరగకుండా నివారించడానికి మరియు దొంగతనాలను గుర్తించడానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పట్టణంలో ఇప్పటికే దాదాపు 800 సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రజల సహకారంతో మరింత మంది పెట్టుకుంటే నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై చెన్నకేశవులు, ఎస్సై రహమతుల్లా, ఎస్సై హాజరత్తయ్య, పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Latest News
