*అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్*
జహీరాబాద్ (ఫిబ్రవరి 4)
తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు ఈ రోజు ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి)లను పట్టణంలోని అతిథి హోటల్ వద్ద జహీరాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి ఒక సంవత్సరం గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులుఅరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడు తూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు