కారు లో రవాణా చేస్తున్న 300 లీటర్ల నాటు సారా స్వాధీనం , ఇద్దరు అరెస్ట్.,
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 11 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
ఈరోజు జియమ్మ వలస మండలం పరిధిలో గల దాసరి పేట గ్రామ సమీపంలో గల వట్టిగెడ్డ రిజర్వాయర్ కాలువ గట్టు వద్ద కురుపాం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. శ్రీనివాసరావు వారి సిబ్బంది తో కలిసి కారు లో నాటు సారా రవాణా గూర్చి వచ్చిన సమాచారం లో భాగంగా రూట్ వాచ్ చేస్తుండగా AP 35 A 5708 TATA Indigo తెల్లటి రంగు కారు లో నాటు సారాయీ రవాణా చేస్తున్న కారు పాలకొండ మండలం చిన మంగలా పురం కు చెందిన కారు డ్రైవర్ వడ్డాది సురేష్ ను మరియు జియ్యమ్మ వలస మండలం చిన మెరంగి చెందిన బొత్స అనిల్ కుమార్ అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి 20 ప్లాస్టిక్ కాన్స్ లో నిలువ చేసిన 300 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకొని , వారికి నాటు సారా సప్లయ్ చేసిన రాయగడ జిల్లా సందుబడి గ్రామానికి చెందిన రత్నాల మాధవ ను మరియు వంగర మండలం కోదుల గుమడ గ్రామానికి చెందిన బొచ్చ బలరాం, చినమేరంగి కి చెందిన మీసాల శ్రీకాంత్,సిరిపురపు అశోక్, సిరిపురపు కళావతి, అనే వారిపై పై కూడా కేసు నమోదు చేశామని, అలాగే కారు యొక్క యజమాని కొమరాడ మండలం గంగి రేగువలస గ్రామానికి చెందిన సింహాచలం పై కూడా కేసు నమోదు చేసినట్లు వీరందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.ఈ సందర్బంగా సీఐ. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామలలో తరచుగా నాటుసారా తయారీ, రవాణా,అమ్మకాలు చేస్తు పట్టుబడుతున్న వారిపై మరియు నాటు సారాయీ వ్యాపారానికి పరోక్షంగా సహకరిస్తున్న వారిని స్పెషల్ స్క్వాడ్ ల సహాయంతో ట్రాక్ చేస్తున్నామని అటువంటి వారు మరలా పట్టుబడితే అటువంటి వారిపై పిడి చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.