విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని, సిఐటియు, ఏఐటియుసి, ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో రాస్తారోకో! పోలీసులు అరెస్టులు!!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు , ఏఐటీయూసీ,ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరులో, టోల్గేట్, గాంధీ విగ్రహం వద్ద, రాస్తారోకో, నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, టి రాధాకృష్ణ, మాట్లాడుతూ,9వేల కోట్ల పెట్టుబడికి 58 వేల కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నేస్ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశరని, 75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం నుండి 30 లక్షల టన్నులకు స్టీల్ ఉత్పత్తి పడిపోనుందని తెలిపారు. దీంతో అనివార్యంగా నష్టాలలోకి విశాఖఉక్కును నెట్టాలని బీజేపీ మోడీ ప్రభుత్భం భావిస్తోందని, టిడిపి, జనసేన, కూటమిపై, పార్లమెంట్ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిచేసి విశాఖఉక్కు ప్రేవేటికరణ ఉపసంహరణ ప్రకటనను కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయించాలని డిమాండ్ చేశారు. సొంత ఘనులు విశాఖఉక్కుకు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో, 64 ఎంపీల రాజీనామాలతో, 32 వేల ఎకరాల రైతుల భూమిని సేకరించి నిర్మించుకున్న విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్రాల్లో ప్రజలు సిద్ధంగాలేరని, అవసరమైతే మరో పోరాటానికి,సిద్ధంకావాలనిపిలుపునిచ్చారు. విభజన చట్టం ప్రకారం, కడప ఉక్కును ప్రారంభించి, వెనుకబడిన రాయలసీమ, నిరుద్యోగులకు, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, కడప హుక్కు రాయలసీమ హక్కు, అని నినాదించారు. నేషనల్ హైవే పైన రాస్తారోకోతో అర్థగంట, ట్రాఫిక్ స్తంభించబోయింది. సీఐ హేమంత్ నాయుడు, పోలీసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ , బి కే యం యు జిల్లా అధ్యక్షులు పండుగలమని, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం మండల నాయకులు, బొజ్జ శివయ్య, లను అరెస్టు చేసి విడుదల చేశారు. ఈ రాస్తారోకోలో, సిఐటియు జిల్లా నాయకులు ఏపీఎండీసీ, జేఏసీ పోరాట కమిటీ, కన్వీనర్, ఆర్ వెంకటేష్, సిఐటియు ఉపాధ్యక్షులు, మోడీ సుబ్బరామయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు, కేశవులు, ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్, కార్యదర్శి, పి మురళి, సిపిఐ నాయకులు దార్ల రాజశేఖర్,సిఐటియు నాయకులు, జేఏసీ పోరాట కమిటీ, ట్రెజరర్బి. హరి, పుల్లగంటి రమణయ్య సెక్రటరీ, కె. హరికృష్ణ పబ్లిసిటీ సెక్రటరీ, డబ్బు. శివ ప్రసాద్ ఆర్గనైజషన్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఆర్ హరినాధ్, శంకర్ ,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 13