ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

నిజామాబాద్, సెప్టెంబర్ 22 (ప్రశ్న ఆయుధం)

నిత్యం జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తూంపల్లి గ్రామానికి చెందిన భుక్యా విట్టల్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని (TS16EX 8578) ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్క్ చేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి తెలిపారు.

సోమవారం దేవి రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో, దొంగిలించిన బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు భైంసాకు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్‌గా గుర్తించారు. ప్రస్తుతం వారు నగర శివారులోని నాగారం 50 క్వార్టర్స్‌లో నివాసముంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మద్యం అలవాట్లు, జల్సాల కోసం బైక్‌లు దొంగతనానికి పాల్పడుతున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుండి నలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now