*రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధికి రూ 10,116 విరాళం అందజేసిన కళాకారుడు ప్రభు*
*జమ్మికుంట జూన్ 11 ప్రశ్న ఆయుధం*
గత ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయం శిథిలం కావడంతో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ పెద్దలు శ్రీ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసుకొని శిథిలమైన శివాలయాన్ని తొలగించి పునః ప్రారంభించడానికి ముందుకు వచ్చి దాతల సహాయంతో అభివృద్ధి చేయడంలో భాగంగా మడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ట్ కళాకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) జమ్మికుంట లోని తమ నివాసంలో బుధవారం రూ 10,116 చెక్కును అందించారు అనంతరం వారు మాట్లాడుతూ సర్వ మతాల కలయికనే భారతదేశం అంటూ అన్ని కుల,మతాలను గౌరవిస్తూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని తమ గ్రామంలో శివాలయం పునః నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ నిర్మాణం పూర్తయ్యే వరకు భాగస్వామ్యం అవుతానని దేవాలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు మడిపల్లి స్వగ్రామంలో జన్మించిన అంబాల ప్రభాకర్ తమ గ్రామ అభివృద్ధికి ఎంత చేసిన తక్కువనేనని దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ మడిపల్లి గ్రామం రుణం తీర్చుకుంటున్నానని మడిపల్లి గ్రామంలోనీ ప్రజలు, నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయులే, కాకుండా జమ్మికుంట పట్టణంలోని అధికారులు , వ్యాపారులు,
రాజకీయ నాయకులు దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు శ్రీ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు అదే విధంగా జమ్మికుంట (కొత్తపల్లి)చెందిన మెకానిక్ రాంపల్లి మధు దేవాలయాల అభివృద్ధికి రూ 10,116 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పోసిన సత్యనారాయణ, కస్తూరి రాములు, గుర్రాల మల్లారెడ్డి, పసరగొండ సదానందం, అనిల్ తదితలు పాల్గొన్నారు.