Site icon PRASHNA AYUDHAM

బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని సన్మానించిన అరుణ్‌రాజ్

IMG 20250819 114107

Oplus_131072

సంగారెడ్డి/నారాయణాఖేడ్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్ ఘనంగా సన్మానించారు. సోమవారం వారి నివాసంలో గోదావరి అంజిరెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాధ్యతలు తనకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిజెపి సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

Exit mobile version