ప్రశ్నయుధం కామారెడ్డి ప్రతినిధి జూలై26
కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు విడుదలపై కాలయాపన చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని చిత్తుచిత్తుగా ఓడకొడతామని రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలు కావచ్చు. జిల్లా పరిషత్. మున్సిపల్ ఎలక్షన్లలో కామారెడ్డి పట్టణం నుండి మొదలు పెడతామని కాంగ్రెస్ పార్టీని మరి భూస్థాపితం అయ్యేంతవరకు పోరాడుతామని ఆర్యవైశ్య సంఘం తరఫున కామారెడ్డి పట్టణ అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు మోటూరు శ్రీకాంత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర శ్రీనివాస్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ గరిపల్లి శ్రీధర్ మోత్కూరి శ్రీనివాస్ బోనగిరి శివకుమార్ పట్టణ కార్యవర్గ సభ్యులు అలాగే ఆర్యవైశ్య సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.