*నాటి వీరా తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే పేదలకు భూములు దక్కాయి*.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య
సిద్దిపేట సెప్టెంబర్ 17 ప్రశ్న ఆయుధం :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు వీరుల రక్త తర్పనతో తెలంగాణ విలీనం అయిందని, ఆ పోరాట పలితంగానే పేదల చేతుల్లోకి భూములు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య అన్నారు.సోమవారము రోజున సిద్దిపేట స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వారోత్సవ సభ పార్టీ అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవి కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ నేడు తెలంగాణ సమాజం అనుభవిస్తున్న స్వేచ్చ వాయువుల వెనుక వేలాది మంది కమ్యూనిస్టుల త్యాగం దాగి ఉందని, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన మహోన్నత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, షేక్ బందగి, షోయబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ వంటి ఎందరో వీరులు పోరాటంలో పాల్గొనీ తమ జీవితాలను తెలంగాణ కోసం ధారపోశారని తెలిపారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రతిఘటన ఉద్యమం క్రమంగా భూ పోరాటంగా మారిందని దున్నేవాడికే భూమి దక్కాలని నినదించిందని అన్నారు. నిజాం రాచరిక నిరంకుశ పాలన మీద తిరుగుబాటుగా మారి పెత్తందారులకు వ్యతిరేకంగా ఊర్లకు ఉర్లే ఏకమై ప్రజలు సంఘటితంగా పోరాడారని అన్నారు 4000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేశారని పది లక్షల ఎకరాల భూమిని రైతాంగానికి పంపిణీ చేశారని అక్రమంగా తాకట్టు లో ఉన్న భూమిని విముక్తి చేయడమే కాకుండా పశువుల పంపిణీ చేపట్టి పన్నుల వసూలను కూడా రద్దు చేశారని వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచి మహిళను నిర్ణయాలలో భాగస్వాములను చేసి రుణపత్రాలను సైతం రద్దు చేసినపోరాటం ప్రపంచ చారిత్రక పోరాటామని అన్నారు. జమీందారీ దోపిడీకి అణచివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ రైతాంగ పోరాటంలో కుల పట్టింపులు కొట్టుకపోయి వివక్ష అంటరానితనం అంతమైందని అన్నారు ప్రపంచ చరిత్రలో 5 సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ మహోన్నత పోరాటం గురించి బిజెపి వంటి మతోన్మాద పార్టీలు రెండు వర్గాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం తగదని అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు రాజకీయ అవసరాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు రైతాంగ పోరాట దాటీకి తట్టుకోలేక నిజాం రాజు చేతులెత్తి చేసిన సమయంలో పటేల్ సైన్యాలు రంగంలోకి దిగి సాయుధ పోరాటాన్ని అణిచివేశారని లేకపోతే నిజాం రాచరికం కుప్పకూలేదని ఈ మహోన్నత పోరాటంలో 4000 మంది అమరత్వం పొందగ వేలాది మంది కమ్యూనిస్టులు తమ జీవితాలను త్యాగం చేసారని ఇది ముమ్మాటికి తెలంగాణ విలీన దినమే గాని విమోచన, విద్రోహ దినం కానే కాదని అన్నారు నాటీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను బలపరిచి దున్నేవాడిదే భూమి అని నినదిస్తూ భూ పోరాటాలకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, గుడ్డు బర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య, బండ కింది అరుణ్ కుమార్, జాలిగపు శిరీష, దాసరి సిద్దిపేట రూరల్ మండల కార్యదర్శి మామిడాల కనకయ్య, మండల బాధ్యులు చల్లారపు తిరుపతిరెడ్డి, తునికి మహేష్, ఎల్లయ్య, నాయకులు కొండం సంజీవ్ కుమార్, అభిషేక్ కుమార్, పి అంజయ్య, కొమురయ్య, ప్రభాకర్, రాజయ్య, ఎల్లయ్య, బాలరాజు, రామచంద్రం, రాజమౌళి, దండు లక్ష్మి, వినోద, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.