రక్తం ఎరుపు ఉన్నంతకాలం ఎర్రజెండా రెపరెపలు..!

*రక్తం ఎరుపు ఉన్నంతకాలం ఎర్రజెండా రెపరెపలు..!* !

*వందేళ్ల చరిత్ర ఎర్రజెండా పార్టీది.* ..

*దున్నే వాడిదే భూమి అంటూ నినదించిన పార్టీ ఎర్రజెండా.* ..

*మతోన్మాదమే బిజెపి అజెండా*

*పేదోడికి అండగా సిపిఐ పోరాటాలకు రామకృష్ణ పిలుపు*

*స్వాతంత్రోద్యమానికి పూర్వం భూ పోరాటాలు* , పెత్తందారులు, రజాకార్లకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనకు ఎదురెొడ్డి నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు పూర్తి అయ్యాయని, మరో వందేళ్లయిన చరిష్మా తగ్గకుండా ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బెస్తరపల్లి లో అమరవీరుల స్తూప ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు కళ్యాణదుర్గం, తూముకుంట, బెస్తరపల్లిలో ఏఐఎస్ఎఫ్, ప్రజా సంఘాల నాయకులు బైక్ ర్యాలీలతో ఎర్ర జెండా పట్టుకుని ఊరేగింపుగా రాష్ట్ర , జిల్లా నాయకత్వాన్ని స్వాగతం పలికారు. బెస్తరపల్లిలో అమరవీరుల స్థూపావిష్కరణ చేసిన అనంతరం నూతనంగా నిర్మించిన సిపిఐ కార్యాలయం , గ్రంధాలయం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో స్థానిక సీనియర్ నాయకులు ఓబులపతి బీకే గోపాల్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శిలు నారాయణస్వామి, మల్లికార్జున జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప , కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, శ్రీరాములు, రాజారెడ్డి, కేశవరెడ్డి , పద్మావతి , మాజీ ఎంపీపీ గిరిజ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అమరవీరుల పేరు మీద బెస్తరపల్లిలో జరుగుతున్న కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వందేళ్లుగా జరుగుతున్న భూ పోరాటాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న బెస్తరపల్లి భూ పోరాటంలో పేదలకు 45 వేల ఎకరాల భూమి పంచిన ఘనత ఇక్కడ నాయకత్వానికి దక్కుతుందని ఐదుల్లు సదాశివన్, బంగి ఎర్రిస్వామి, బంగి రామప్ప పిఎస్ శర్మ, బిటి రామన్న , గోవిందప్ప, చెట్ల రుద్రప్ప, లింగన్న, నాగిరెడ్డి , నారాయణరెడ్డి, తిమ్మప్ప తదితరులకు దక్కుతుందన్నారు. దేశంలో వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ , కాంగ్రెస్ పార్టీలు మాత్రమే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాయని ఆయన గుర్తు చేశారు. రాయల్ నేవీ తిరుగుబాటు ఉద్యమంలో ఓడలపై ఎర్రజెండా ఎగురవేసి నిరసన తెలిపిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కు. భూమి కోసం , భుక్తి కోసం, దీన్నే వారికే భూమి అనే నినాదంతో రక్త తర్పణం చేసిన ఘనత కమ్యూనిస్టుపార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కష్టజీవుల కోసం నిలబడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. చరిత్ర లేని బిజెపికి దేశాన్ని పాలించే అర్హత లేదని, బిజెపి ది మతోన్మాద అజెండానే కాని, పేద ప్రజల అభివృద్ధి అజెండా కాదు అన్నారు. ప్రజల మధ్య చీలిక తెచ్చి కుల మతాలను రాజేసి, ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి వస్తున్న మోడీ హిందువులకు చేసింది ఏమీ లేదన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైతులు మద్దతు ధర కోసం ధర్నా చేస్తా ఉంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని , ధరల పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం పై ఏనాడూ మాట్లాడరన్నారు. ముస్లిం, మైనార్టీలు, క్రైస్తవులు,, సిక్కులు ఇలా వేర్వేరుగా రాజకీయం చేసి అధికారంలోకి వస్తున్నారని అన్నారు. 143 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో మెజార్టీ గా ఉన్న హిందువులకు బిజెపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో ఉంది కనుక దేశంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్, నెహ్రు , గాంధీ లాంటి వారిని కించపరుస్తూ నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. స్వాతంత్రోద్యమంలో పోరాటాలు త్యాగాలకు వెళ్లి, జైళ్లకు వెళ్లి వచ్చిన వారిని కించపరుస్తూ పబ్బం గడుపుతున్న బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని అన్నారు . రాష్ట్రంలో గత ఏడాది అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజిని కంటే ఎక్కువ మతిమరుపు ఉన్న వ్యక్తి అని దుయ్యబట్టారు. జగన్ దుర్మార్గ పాలన , నియంత లాగా మారిన ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించి చంద్రబాబుకు పట్టం కడితే ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం దివాలా చేసింది అని, శ్రీలంక కన్నా ఎక్కువ అప్పుల పాలయ్యామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక మంత్రి ద్వారా రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా పెట్టారని నిలదీశారు . 15486 వేల కోట్లు కరెంటు చార్జీలు పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇదే జరిగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావడానికి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు తప్పుల మీద తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం కల్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సినిమా టికెట్లు రేట్లు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపడానికి పూనుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ శత వార్షకోత్సవాన్ని జరుపుకుంటున్న కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటూ వారు పోరాటపతిమాను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరింత ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తుందన్నారు. దున్నేవాడికే భూమి, ఇళ్ల స్థలాలు , రేషన్ కార్డులు పేదవారికి అందేదాకా ఎర్రజెండా పార్టీ ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ త్యాగాలకు మారుపేరుగా కమ్యూనిస్టులు నిలబడతారని అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో గంజి కేంద్రాలు పెట్టి పేదలను ఆదుకుని, ఉద్యమాలు చేసిన ఈ ప్రాంత పోరాట యోధులను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now