Site icon PRASHNA AYUDHAM

అమృత మహోత్సవంలో భాగంగా 90 లక్షల రూపాయల పనులు ప్రారంభించాలి

IMG 20240827 WA0449

అమృత మహోత్సవంలో భాగంగా 90 లక్షల రూపాయల పనులు ప్రారంభించాలి

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించాలి

– శుభ్రత విషయంలో చర్యలు పాటించాలి

– అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలి

-కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 27, కామారెడ్డి :

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మంగళవారం ఉదయం మున్సిపల్ , ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో మధ్యాహ్నం పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ, జాతీయ రహదారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ అమృత్ మహోత్సవంలో భాగంగా 90 లక్షల రూపాయల పనులు ప్రారంభించాలని అన్నారు. అవసరమయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రిని ఆహ్వానిస్తానని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించే లక్ష్యంగా రెండు కోట్ల 50 లక్షల వ్యయంతో కొనసాగుతున్న పనులు తొందరగా పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. అదేవిధంగా శానిటరీ అధికారులు శుభ్రత విషయంలో చర్యలు పాటించాలనీ అన్నారు. వర్షా కాలం దృష్ట్యా అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలనీ అన్నారు. ముఖ్యంగా డెంగ్యూ లాంటి వ్యాధి విషయంలో ప్రజలకు అవగాహన చేపట్టాలని అన్నారు.

Exit mobile version