ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులు ఒకరొకరుకరుగా తీహార్ జైలు నుంచి విముక్తి పొందుతున్నారు. అప్రూవర్లుగా మారినవారందరూ ముందుగా బయటకు వచ్చేశారు. తర్వాత నిందితులుగా ఉన్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాలు బయటకు వచ్చేశారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఒక్కరే ఇంకా లోపల ఉండిపోయారు.ఆమె కూడా సోమవారం బెయిల్‌పై బయటకు వచ్చేస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా కేసు తేలేవరకు నిందితులను జైల్లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. కనుక కల్వకుంట్ల కవితకి జైలు నుంచి విముక్తి లభించడం ఖాయంగానే కనిపిస్తోంది..విడుదల కోసం కేసీఆర్ నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీకి అప్పగించబోతున్నట్లు సమాచారం. దానిపై చర్చ మొదలుపెడిత అది మరో పెద్ద కధ అవుతుంది.కనుక ఆమె జైలు నుంచి బయటకు రావడం వరకే ఈ చర్చని పరిమితం చేసి చూస్తే, బిఆర్ఎస్-బీజేపీల మద్య జరిగే ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వలన ఆమెపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన లిక్కర్ స్కామ్ కేసులకు బ్రేక్ పడుతుంది. రెండు దర్యాప్తు సంస్థలు ఆ ఫైల్స్ అన్నీ మూటకట్టి భద్రంగా అటక మీద పెట్టేయవచ్చు.అదే జరిగితే కల్వకుంట్ల కవితపై ఎటువంటి కేసు, విచారణ, ఒత్తిడి లేకుండా బయటకు వస్తారు. కనుక ఆమె ముందే చెప్పిన్నట్లు జైలు నుంచి ‘కడిగిన ఆణిముత్యంలా’ బయటకు వస్తారన్న మాట! ఆమె ఆణిముత్యంలా బయటకు వస్తే దానికి ఏవిదంగా హైప్ సృష్టించాలో కేసీఆర్‌కి బాగా తెలుసు. తెలంగాణ బిడ్డ, పోరాట యోధురాలు కల్వకుంట్ల కవితకు హైదరాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికింపజేసి, చివరికి న్యాయం ధర్మమే గెలిచిందని చెప్పుకోవచ్చు..