BC హక్కులపై మత రాజకీయాలా..?
మజ్లిస్ ఛాయలో కాంగ్రెస్ పాలన..?
బీసీ కోటాలో ముస్లిం నేతల నియామకం వివాదం
“నిజమైన బీసీలకు అన్యాయం” – బీజేపీ ఆరోపణ
కాంగ్రెస్–మజ్లిస్ కుమ్మక్కు ప్రశ్నార్థకం
అసదుద్దీన్, అక్బరుద్దీన్, షబ్బీర్ అలీ, అజహరుద్దీన్ బీసీలా..?
“మతపరమైన రిజర్వేషన్లు ఆపకపోతే పోరాటం” హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 8:
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై మత రాజకీయాలు నడుస్తున్నాయంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 31 బీసీ రిజర్వ్‌డ్ సీట్లలో మజ్లిస్ పార్టీ గెలవడం బీసీలకు న్యాయం చేసినట్టా? అని నిలదీసింది.
“అసదుద్దీన్, అక్బరుద్దీన్, షబ్బీర్ అలీ, అజహరుద్దీన్ – వీరంతా నిజంగా బీసీలా? బీసీ కోటాను ముస్లిం వోటు బ్యాంకు కోసం వాడుకోవడమే కాంగ్రెస్–మజ్లిస్ గూటి లక్ష్యం” అని ఆరోపించింది.
మతపరమైన రిజర్వేషన్ల పేరుతో నిజమైన వెనుకబడిన బీసీలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు. “ఈ కుట్రను ఆపకపోతే బీజేపీ తీవ్ర పోరాటానికి దిగుతుంది” అని హెచ్చరించారు.