Site icon PRASHNA AYUDHAM

బాలుని అందుకున్న ఆసరా ఫౌండేషన్

IMG 20240914 WA0163

రక్తదానంతో ఆపదలో ఉన్న రెండు సంవత్సరాల బాలుని ఆదుకున్న ఆసరా ఫౌండేషన్

కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 14

కరీంనగర్ జిల్లా కేంద్రం లో ఇటీవల ప్రారంభించబడిన ఆసరా ఫౌండేషన్ ఆపదలో రెండు సంవత్సరాల బాలుడికి రక్తదానం చేసి ఆదుకుంది ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాపోలు గోపికృష్ణ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం వాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిగేటి నిహాంత్ (02) రక్తహీనతతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాలుడికి అత్యంత అరుదైన “ఏబి నెగిటివ్” రక్తం ఏర్పడిందన్నారు. బాలుడి సంబంధికులు తమ ఫౌండేషన్ సభ్యుడైన కొత్తపల్లి రూరల్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జాడి అనిల్ ను సంప్రదించగా వెంటనే స్పందించి రక్తదానం చేశారని తెలిపారు. అరుదైన రక్తాన్ని అందించి బాలుడికి ప్రాణదాతగా నిలిచిన అనిల్ ను సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఆర్. గోపికృష్ణ, సభ్యులు కోలగాని శ్రీనివాస్, కే. ప్రవీణ్ కుమార్, జి. తిరుపతి, ఏం. రవి చందర్, ఎస్. నిఖిల్ తదితరులు అభినందించారు.

Exit mobile version