*తాసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా*
*మెమోరండం అందజేసిన ఆశ వర్కర్లు*
*సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ కొప్పుల శంకర్*
*జమ్మికుంట మార్చి 17 ప్రశ్న ఆయుధం*
ఆశ వర్కర్లకు 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పిఎఫ్ ,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సిఐటియు జిల్లా జైంట్ సెక్రెటరీ కొప్పుల శంకర్ హాజరై మాట్లాడుతూ 19 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశలతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఏ ఎన్ సి గౌట్ డెలివరీ టార్గెట్లు పెట్టి మానసికంగా ఆశలను హింసిస్తున్నారని ఉద్యోగ భద్రత లేదని పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ఆశలకు పిక్స్డ్ వేతనం ఇస్తామని నమ్మబలికారని 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని. 50,000 ఇంటి ఖర్చులకు ఇవ్వాలని. ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు ఏఎన్ఎం ప్రమోషన్ ఇవ్వాలని, ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కొలుగూరి సుజాత, ప్రధాన కార్యదర్శి పర్లపల్లి కవిత, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, కళావతి, కోమల ,యాదక్క మండలంలోని అన్ని గ్రామాల ఆశలు పాల్గొన్నారు.