ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన :..కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

*ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై వ్యవస్థాపక అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*

ప్రశ్న ఆయుధం, జనవరి 8,కామారెడ్డి,

IMG 20250108 WA0069

కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవస్థాపక ప్రణాళికలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎగుమతులు చేసే వాటిపై అనుమానాలు, సలహాలు, సూచనలు అందించడానికి వివిధ విభాగాల వాటాదా రులతో ఈ అవగాహన కార్యక్రమంలో చర్చించారని, సమస్యలను దశలవారీగా నివృత్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమం జిల్లాలోని వ్యాపార వేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు కలిగి వున్న వాటిని ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా నుండి ఎగుమతులను నిరోధించే పలు అడ్డంకులను వాటాదారులతో చర్చించారు. ఈ అవగాహన సదస్సులో ఏం.ఎస్.ఏం.ఈ.,

బి.ఐ.ఎస్. ( బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) , అపెడ, టీఎస్ఐఐసి, పలు సంస్థల ప్రతినిధులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ లాలు నాయక్, జిల్లా నుండి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి, జిల్లా గ్రామీాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, ఎల్.డి.ఏం.రవికాంత్, జిల్లాలోని పలువురు వ్యాపార వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now