ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలీ  – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలీ

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 19 సాయిలన్ బాబా కాలనీ లో జరీనా బేగంకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవట్ ఇవ్వడం జరిగిందని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుండి దశలవారీగా నిర్ధిష్ట సమయంలో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు. పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఇండ్ల నిర్మాణం పత్రాన్ని కలెక్టర్ లబ్ధిదారురాలికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్, ఏ ఈ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now