పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం)జూలై 17
ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ కమ్మాజీ వాడి శివారులో భూభారతి దరఖాస్తు ఫీల్డ్ వెరిఫికేషన్ పరిశీలించారు వజ్జపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో చర్చించడం జరిగింది.సానిటేషన్ పరిశీలించి సూచనలు చేయడం జరిగింది తర్వాత పద్మాజీ వాడి ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. విద్యార్థులతో ముచ్చటించి త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థుల సన్మానించడం జరిగింది మధ్యాహ్న భోజనం పరిశీలించారు పంచాయతీ నర్సరీ మొక్కల పంపిణీ తీరును తనిఖీ చేయడం జరిగింది తర్వాత సదాశివ నగర్ గ్రామ పరిధిలో వర్షపు నీటి సంరక్షణ కుంట వద్ద మొక్కలు నాటారు వర్షపు నీటి సంరక్షణ వలన భూగర్భ జలాలు మరియు జీవ వైవిధ్యం పెరుగుదలకు దోహదపడతాయని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ రెవెన్యూ డివిజనల్ అధికారి వీణ జిల్లా పంచాయతీ అధికారి మురళి జిల్లా హౌసింగ్ విజయ పాల్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.