Site icon PRASHNA AYUDHAM

ఉత్తరాంధ్రకు వెలకట్టలేని నిధి అశోక్ గజపతిరాజు.  ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. 

IMG 20250626 WA2473

ఉత్తరాంధ్రకు వెలకట్టలేని నిధి అశోక్ గజపతిరాజు.

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర.

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 27 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం : టిడిపి మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెలకట్టలేని నిధి అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కొనియాడారు. అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు విజయనగరం అశోక్ బంగ్లాలో గురువారం వైభవంగా జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టిడిపి నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర అశోక్ గజపతిరాజును శాలువాతో సత్కరించి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్టీఆర్ నుండి ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ వరకు అశోక్ గజపతిరాజు అత్యంత అభిమాన పాత్రుడని పేర్కొన్నారు. ఆశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగాను, రాష్ట్ర మంత్రిగానూ, ఎమ్మెల్యేగాను ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారని స్పష్టం చేశారు.ఆయన టిడిపి నాయకులు అందరికీ ఎల్లవేళలా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Exit mobile version