శివ్వంపేట, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ను బీజేపీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల శనివారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ సాదుల మాట్లాడుతూ.. నన్ను భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు నీవంతు కృషి చేయాలని, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గెలిచి భారతీయ జనతాపార్టీ జెండాను ఎగర వేయాలని సూచించినట్లు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల
Oplus_131072