Site icon PRASHNA AYUDHAM

శమీర్పేట్‌లో ఆశ్రమం బాలుడు అదృశ్యం

IMG 20251022 WA0050

శమీర్పేట్‌లో ఆశ్రమం బాలుడు అదృశ్యం

క్రిస్టన్ ఆశ్రమం (స్పెషల్ హోమ్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్)‌లో నివసించే బాలుడు కనిపించకపోవడం కలకలం

అదృశ్యమైన బాలుడు అకాష్ (14), మానసిక వికలాంగుడు

క్రీమ్ చొక్కా, నీలం ప్యాంటు ధరించి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు

ఆశ్రమ సూపర్వైజర్ రాజన్ బేహారా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు

శమీర్పేట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

ప్రశ్న ఆయుధం శమీర్పేట్, అక్టోబర్ 22:

శమీర్పేట్‌లోని క్రిస్టన్ ఆశ్రమం (స్పెషల్ హోమ్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్)లో నివసిస్తున్న 14 ఏళ్ల బాలుడు అకాష్ కనిపించకుండా పోయాడు. మానసిక వికలాంగుడైన ఆ బాలుడు సరైన రీతిలో మాట్లాడలేడు, తన పేరు మరియు కొన్ని మాటలు మాత్రమే పలుకగలడు.

అకాష్ ఎత్తు 4 అడుగులు 5 అంగుళాలు, వర్ణం మధ్యస్థ, ముఖం గుండ్రంగా ఉంటుంది. కనిపించే సమయానికి క్రీమ్ రంగు చొక్కా, నీలం ప్యాంటు ధరించి ఉన్నాడు.

ఈ ఘటనపై ఆశ్రమ సూపర్వైజర్ రాజన్ బేహారా (54) ఫిర్యాదు చేయగా, శమీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాలుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Exit mobile version