నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి నవంబర్ 23:
ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామ శివారులో గల లక్ష్మీనరసింహ స్వామి ఆలయoలో అష్టమి శనివారాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణంలో గల అష్టముఖి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు, అనంతరం ఆలయ ప్రాగణంలో గల శివాలయంలో పూజలు నిర్వహించి, లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తుల అధిక సంక్యలో వచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడాయి. ‘గోవింద’ నామస్మరణతో ఆలయ ప్రాగణం మారుమ్రోగింది. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు పతిష్ట ఏర్పాట్లు చేశారు.
దక్షిణ భారతదేశం లోనే ప్రసిద్ధి గాంచిన అష్టముఖి కొనేరులో అష్టమి లేదా అమావాస్య శనివారాలలో పుష్కరిణిలో స్నానమాచరించి మూలవిరాట్టును దర్శించుకుంటే సకలపాపాలు తొలగుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచర్యులు మాట్లాడుతూ….అష్టమి శనివారం సందర్భాన్ని పురస్కరించుకొని స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ కుటుంబసభ్యులు చల్లగా వుండాలని స్వామివారిని వేడుకున్నారు. ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతానికి సైతం విశేష స్పందన లభించిందని. భక్తుల సహకారంతో ప్రతి శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ సీనియర్ అసిస్టెంట్ రఘు శర్మ తెలిపారు.