సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన వ్యాయామ శాస్త్ర విభాగ అధ్యాపకురాలు పి.అశ్వినికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను అందించిందని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వ్యాయామ శాస్త్ర విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ కు దీప్లా ఆధ్వర్యంలో “An Analytical Study of selected exercise and Asanas on Sports performance during Menstrual Cycle among Eumenorrheic Athletes” అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాల వ్యాయా అధ్యాపకురాలు పి.అశ్వినికి డాక్టరేట్ ను ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. తమ కళాశాలకు చెందిన అధ్యాపకురాలికి డాక్టరేట్ రావడం పట్ల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
డాక్టరేట్ పొందిన తారా కళాశాల అధ్యాపకురాలు అశ్విని
Published On: December 31, 2024 10:18 pm
