టీచర్ల బోధనపై ఆరా…!!

టీచర్ల బోధనపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్న….

కిరణ్ మయి కొప్పిసెట్టి ఐఏఎస్ 

జుక్కల్ ఆర్సీ సెప్టెంబర్ 11 ప్రశ్న ఆయుధం 

బుదవారం రోజు పెద్ద ఏక్లార గ్రామ శివారులో ఉన్న గురుకుల పాఠశాల ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయి కొప్పిసెట్టి ఐఏఎస్ తనిఖీ చేశారు. 

పాఠశాల లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం వండిన అన్నం తిని రుచి చూశారు.

భోజనం నాణ్యతగా పెట్టాలని, అదేవిధంగా క్యాంపస్ మొత్తం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శానిటేషన్ సరిగా లేదని, మరో సారి తనిఖీకి వచ్చినప్పుడు శానిటేషన్ సక్రమంగా చేయించాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు.

భోజనం, వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టీచర్ ల బోధన పై విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఏం.డి ముజీబ్, ఎంపీడీవో రాణి, గిర్ధవార్ శంకర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now