అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, &; కోర్టు కానిస్టేబుల్ ఏసిబి ట్రాప్

ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

– కోర్టు కానిస్టేబుల్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు కానిస్టేబుల్ ద్వారా 10 వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో 2018 లో నమోదైన చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును త్వరగా ముగించడానికి ఏపీపీ గుగ్లోత్ అశోక్ శివరాం నాయక్ బాధితునికి 15 వేల లంచం డిమాండ్ చేసాడు. చివరికి 10 వేలకు ఒప్పందం చేసుకోగా పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా శుక్రవారం బాధితుని నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు ఐదు గంటల పాటు కేసు విచారణ కొనసాగిందని, ప్రస్తుతం ఏపీపీ ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు డిఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం ఏపీపీ, కోర్టు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఏసిబి కోర్టులో శనివారం హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్ సంజయ్ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఏపీపీ అశోక్ శివరాం నాయక్ సైతం జిల్లా జడ్జి కోసం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment