షేక్ యాకుబ్ షావలి
జిల్లా కార్యదర్శి
గోకినపల్లి ప్రభాకర్ రావు
పాల్వంచ డివిజన్ కార్యదర్శి
హాస్పటల్ నూతన కమిటీ ఎన్నిక
అశ్వరావుపేట, ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో, ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్, యాకుబ్ షావలి సిపిఐఎంల్మా స్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ
అశ్వరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పేషంట్లకొరకు హాస్పటల్ని పరిశుభ్రంగా ఉంచుతూ,కట్లు కడుతూ పనులు చేస్తున్న కార్మికుల కుటుంబాలు చిన్న జీతంతో అవి కూడా నెల నెల రాణి దౌర్భాగ్య పరిస్థితి, వచ్చిన ఈ చిన్నజీతాలలో పిఎఫ్, లెక్కలు లేకపోవడం ఈ ఎస్ ఐ కార్డులు లేకుండానే జీతం కట్ కావడంతో అయ్యో మయ్యో పరిస్థితులలో ఐఎఫ్టియు ప్రతినిధి బృందం ప్రతి ప్రభుత్వ హాస్పిటలను సందర్శించి వారి బాధల్ని జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయారని అన్నారు.
కాంట్రాక్ట్ సిపర్స్ సెక్యూరిటీ గార్డ్స్ పేషంట్ కేర్, ఎంఎన్ఓస్
4,నెలల జీతాలు పెండింగ్లో ఉండటం వలన, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంస్థ ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ కి జిల్లా ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణ అధికారి డాక్టర్ రవిబాబు కి కార్మికుల కుటుంబాల ఆకలి బాధలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపాలని వినతి పత్రాలు అందించారు. ఈ విషయాలపై స్పందించిన అధికారులు
ఐదు నెలల జీతాలు విడుదల చేయడం సంతోషకరమని ఐ ఎఫ్ టి యు కృషి కార్మికులు మరువరానిదని గుర్తు చేశారు. రెండు నెలలు జీతాలు పడ్డాయని, పిఎఫ్ నెల రోజులలో పరిష్కారం చేస్తారని కాంట్రాక్టర్ యూనియన్ కి, అధికారులకు హామీ ఇచ్చారని అన్నారు.
అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏడుగురు ఆఫీస్ బేరర్స్ ను, 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా షేక్,రహిమద్, ఉపాధ్యక్షులుగా, ఊకే నాగమణి, ఉపాధ్యక్షులుగా ముజాయుద్దీన్, కార్యదర్శిగా, తగరం శోభారాణి
సహకార దర్శి, ఎస్ వెంకటేశ్వరరావు
ఆర్గనైజేషన్ సెక్రటరీ, వెంకటకృష్ణ, కోశాధికారి, నార్లపాటి సుజాత,లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాయం వెంకన్న, బుచ్చిరాజు, మాజీ సర్పంచులు, కే గోవిందు, గొంది లక్ష్మణరావు పాల్గొన్నారు
ఇట్లు
గోకినపల్లి ప్రభాకర్ రావు
కార్యదర్శి
సిపిఐఎంల్మా స్ లైన్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కమిటీ, అశ్వరావుపేట