అటల్ బిహారి వాజ్ పేయ్ శత జయంతి వేడుకలు
ప్రశ్న ఆయుధం 25 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )
భారతీయ జనతా పార్టీ బాన్సువాడ పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రియతమ నాయకులు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి 100వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశ అభివృద్ధికి బాటలు పరిచి ప్రపంచానికి భారత శక్తిని చూపిన మనందరి ప్రియతమ నాయకులు మార్గదర్శకులు మాజీ ప్రధాన మంత్రివర్యులు భారతరత్న శ్రీ అటల్ జీ. అన్నారు దేశ యువత అటల్ జీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ సాయిలు పట్టణ కార్యదర్శులు భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి శివ శంకర్ అశ్విన్ సాయి రెడ్డి గంగారాం ఆంజనేయులు అనిల్ విటల్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు