నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 25:
నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దాన్ పల్ మాట్లాడుతు భారతరత్న స్వతంత్ర సమరయోధులు, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్వక్తి అటల్ జీ అని జాతీయ పునరనిర్మాణం కోసం దేశభక్తి పెంపొందించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు.
రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కోసం దేశ అభివృద్దే లక్షంగా ప్రజా సేవే మార్గంగా ఏర్పాటు చేసిన జన్ సంఘ పార్టీ అధ్యక్షులుగా, తరువాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పని చేసి, రెండు ఎంపీ స్థానాలకె పరిమితం ఉన్న పార్టీని ప్రభుత్వం స్వాతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతి పరుడు అటల్ జీ అని కొనియాడారు.
3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సూపరిపాలన అందించి చరిత్రలో ఎక్కిన నాయకుడు, రాజకీయ భీష్మ పితామహుడు అటల్ జీ అన్నారు. రాజకీయ పార్టీలకు అతితంగా అందరు మెచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని అతని నాయకత్వంలో భారతదేశంలో విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేసారని అన్నారు.
ఆర్ధిక వ్యవస్థ పటిష్టకు ఆనాడు వేసిన పునాది నేడు ఐదవ స్థానంలో భారత్ నిలిచిందని, విదేశాంగా విధానంతో సహా అన్ని రంగాలలో గణనియమైన సంస్కరణలు చూసిందన్నారు. పోక్రాన్ -2 అనుపరీక్ష, లాహోర్ డిక్లరేషన్ వంటి దౌత్య కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించడం జరిగిందన్నారు. అటల్ జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్బంగా సూపరిపాలన దినంగా మనం అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దింతో ప్రభుత్వం జవాబుతారి తనంతో వ్యవహరించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వాలు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి దేశమే మాకు ప్రధానం అన్న అటల్ జీ వ్యాఖ్యలు ఎంతగానో ప్రేరేపించాయి అన్నారు. నేటి యువ తరం, రాజకీయ నాయకులు అందరు అటల్ జీ ని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి, అటల్ జి, అద్వానీ లు కలలు కన్నా జాతీయ పునరనిర్మాణం కోసం అందరు కలిసి పని చేయాలనీ ఆ మహనీయుని జన్మదిననా దేశ పౌరులందరు ఒక ప్రతిజ్ఞ (దీక్ష )తీసుకోవాలన్నారు.
ఈ సందర్బంగా అటల్ జీ చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించన అనంతరం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మున్సిపాల్ శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసారు అలాగే ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ లోని స్నేహ సొసైటీలో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.