కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై అట్రాసిటీ యాక్టును నమోదు చెయ్యాలి

*కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై అట్రాసిటీ యాక్టును నమోదు చెయ్యాలి*

*క్యాబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్మ రాస్తారోకో*

*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్*

కరీంనగర్ డిసెంబర్ 24 ప్రశ్న ఆయుధం

మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు మాట్లాడినందుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కలెక్టరేట్ కరీంనగర్ వరకు పాదయాత్ర ద్వారా వెళ్లి నినాదాలు చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి ని క్యాబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాలని అమిత్ షా పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు తుమ్మ పెళ్లి సత్యనారాయణ తో పాటు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొటిదల ప్రణవ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు మోలుగూరి సదయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లో హోంశాఖ మంత్రి అమిషానుపై అట్రాసిటీ యాక్టు కేసు నమోదు చేయాలని క్యాబినెట్ నుండి బర్త్ రాప్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ఆరేపల్లి మోహన్ తిరుపతి శ్రీనివాసు, దొగ్గల భాస్కరు, గుళ్ళు జఫనియా పెద్ది కుమార్ కోటి శ్రీహరి వీరన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now