వ్యభిచార గృహంపై దాడి

వ్యభిచార గృహంపై దాడి

వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు మహిళలను మధురానగర్‌ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మధురానగర్‌ పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.దీంతో పోలీసులు జవహర్‌నగర్‌లోని ఓ గృహంపై దాడి చేశారు.ఈ దాడిలో వరలక్ష్మి అనే నిర్వాహకులు వివిధ జిల్లాల నుంచి మహిళలు, యువతులను ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుందని గుర్తించారు. కాగా దాడి సమయంలో వరలక్ష్మి తోపాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో పురుషులు ఎవరూ ఇంట్లో లేరు. వ్యభిచారం చేయించడానికి వరలక్ష్మి కి స్థానికంగా నివాసం ఉండే నరేష్‌ చౌడేశ్వరి అనే ఇద్దరు సహకరిస్తున్నారు. పోలీసులు నిర్వాహకురాలితో పాటుగా ఇద్దరు మహిళలను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment