అంబేద్కర్ విగ్రహాం పై దాడి ..

మహనీయ డా.బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాం పై దాడి సభ్య సమాజం తలదించుకునే ఘట

నల్ల చంద్ర స్వామి మాదిగ ..

 

పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామం లో సామాజిక న్యాయ శిల్పం అయినా మహనీయ డా,, బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం పై దుండగులు చేసిన దాడిని య యస్ పీ – యం ఆర్ పీ యస్ అనుబంధ సంఘాల పక్షానా తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డా,, బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాం పై దాడి – సభ్య సమాజం తలదించుకునే ఘటన. దాడి చేసి దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చట్టాలు నమోదు చేసి తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.మహనీయ డా,, బీ ఆర్ అంబేద్కర్ ప్రపంచం మేధావి గా సమాజంలో అన్నీ వర్గాల శ్రేయస్సు కోరి భారత రాజ్యాంగాన్ని అందించాడని అటువంటి మహనీయుని జీవిత చరిత్ర తెలుకోకుండా ఆయన సమాజం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు తెలియకుండా మహనీయుని పై అపోహల తో,కుట్ర తో విగ్రహం పై దాడులకు పాల్పడటం అవివేకం .మహనీయ డా,, బీ ఆర్ అంబేద్కర్ బాటలో నడువడం మనవాళి ప్రగతి కి బాటలు వేస్తుంది మానవ సమాజం వికసిస్తుంది.డా,, బీ ఆర్ అంబేద్కర్ సమ సమాజ స్థాపనకు ముందుకు ప్రతి ఒక్కరు సాగాలి.భీమన పల్లి లో దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలనీ ఇటువంటి దుశ్చర్య లకు ఎవరు పాల్పడుకుండా మహానీయుల విగ్రహాల వద్ద నాణ్యమైన సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ ఇటువంటి సమాజ విద్రోహ సంఘటన లకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి .ఆలస్యం చేస్తే జిల్లా వ్యాప్తంగా సమాజం లోని అన్నీ వర్గాల పెద్దలను దళిత సంఘాలను ఏకం చేసి రోడ్ల మీదకు వచ్చి దళితుల నిరసన సెగ చూపిస్తామని తెలియ జేస్తూ సమాజం లో ఇటువంటి విద్రోహ చర్యలు పాల్పడే వారు దుస్సాహసాలు మానుకోవాలని లేకుంటే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now