దళిత నాయకుడిపై దాడి… 24 గంటల్లో నర్సారెడ్డిని అరెస్ట్ చేయండి

దళిత నాయకుడిపై దాడి… 24 గంటల్లో నర్సారెడ్డిని అరెస్ట్ చేయండి

గజ్వేల్‌లో దళిత సంఘాల బహిరంగ డిమాండ్

దాడికి పాల్పడిన తూముకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు

అయినా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన నేతలు

దళితుల ఎదుగుదల రాజకీయ పార్టీలకు జీర్ణించడంలేదని ఆరోపణ

అరెస్ట్ చేయకపోతే తీవ్ర ఉద్యమానికి దళిత సంఘాల హెచ్చరిక

గజ్వేల్, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం):

గజ్వేల్‌లో దళిత నాయకుడు కొమ్ము విజయ్ కుమార్‌పై జరిగిన దాడిని దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తూముకుంట నర్సారెడ్డి దూషణలకు, దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా నర్సారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని వారు మండిపడ్డారు.అంబేద్కర్ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ – “ఇది కాంగ్రెస్‌లోని దళిత నేతలపై రాజకీయ అణచివేతకు నిదర్శనం. ప్రభుత్వం దళితులను రక్షించలేకపోతే, ఉద్యమం తప్పదు” అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేత ఉబ్బని ఆంజనేయులు మాదిగ, మైస రాములు మాదిగ, పొన్నాల కుమార్ మాదిగ, పోసాన్ పల్లి రాజు మాదిగ, మొండి రమేష్ మాదిగ, ఎన్నేల్లి స్వామి, ముండ్రాతీ కృష్ణ, బూరుగుపల్లి బాల రాజు తదితరులు పాల్గొన్నారు.

“24 గంటల్లో నర్సారెడ్డిని అరెస్ట్ చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో మహా ఉద్యమం తథ్యం” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment