గండి వేటలో పేకాట రాయుళ్లపై దాడి..
గాంధారి మండలంలోని గండిపేట గ్రామంలో వేకువ జామున ఒంటిగంటకు నమ్మదగిన సమాచారం మేరకు గాంధారి ఎస్ఐ సిబ్బంది తో గా వెళ్లి గండివేట జవాన్ యూత్ గణేష్ మండపం దగ్గర పేకాట బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారని సమాచారం మేరకు వెళ్లి అక్కడ ఆరుగురిని కిష్టపురం కాశిరామ్, సందీప్ తన్నీరు, ఆంజనేయులు, నూతిలకంటి సాయిరాం, సంతోష్ కుమార్, చాకలి పాపయ్య లను అదుపులోకి తీసుకొని 52 పేక ముక్కలు వారి దగ్గర దొరికిన 1910 రూపాయలను పంచుల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేయనైనది. ఎస్ఐ కి నమ్మదగిన సమాచారం వచ్చిన మేరకు సిబ్బంది యుక్తంగా గండిపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీసు ఎదురుగ మిత్ర యూత్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద పేకాట ఆడుతున్న భైరి సంగయ్య, కాషాగౌడ్ గాంధారి, బ్యాగరి కాశీరాం, దండు సంతోష్, రాజేందర్ భీమనపల్లి రాజేందర్ మొదలగు వారిని అదుపులోనికి తీసుకొని పంచుల సమక్షంలో 27,550/- రూపాయలు 52 పేకముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయనైనది.ఈ సందర్భంగా ఎస్ఐ గారు మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు జూదం, డ్రగ్స్ గంజాయి నేరాలకు గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారిని కఠినంగా శిక్షిస్తామని చట్టాన్ని గౌరవించేవారికి ఎలాంటి భంగం కలుగకుండా చూస్తామని ఎస్ఐ గారు వివరించారు,చట్ట వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆంజనేయులు గారు హెచ్చరించడం జరిగింది