బడిలోని ప్రధానోపాధ్యాయుని పై భక్తి పేరుతో దాడి చేయడం ఆటవిక చర్య..

బడిలోని ప్రధానోపాధ్యాయుని పై భక్తి పేరుతో దాడి చేయడం ఆటవిక చర్య..

తక్షణమే మతోన్మాద దుండగుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్ డిమాండ్

సిద్దిపేట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లోని పాఠశాలలో విధి నిర్వహణలో ఉన్నటువంటి దళిత ప్రధానోపాధ్యాయుడి ని మాలలో ఉన్న విద్యార్థిని తాకాడని భక్తి పేరుతో కాళ్లు మొక్కించడం దుర్మార్గమని, వెంటనే అధికారులు స్పందించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్ మాట్లాడుతూ విద్యాలయాలు సెక్యులర్ మరియు జ్ఞానాన్ని అందించే ప్రదేశాలు గా ఉండాలని విద్యాలయాలలోకి కుల,మత భావాలు ప్రవేశించకుండా అందరూ సమానమనె భావజాలాన్ని ప్రోత్సహించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్ట ను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుని చేత కాళ్లు మొక్కించడం అతని యొక్క ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత హక్కుల కు భంగం కలిగించడమేనని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆ పాఠశాలను సందర్శించి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

లేనిపక్షంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు కోనేరు ప్రవీణ్, తాడూరి విక్రమ్, గొర్రె మధు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now