*దాడులు దౌర్జన్యాలు మన సంస్కృతి కాదు*
*షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్*
*నిందితులను కఠినంగా శిక్షించాలి – బాదేపల్లి సిద్ధార్థ*
*కాంగ్రెస్ నాయకుడు చిలకమర్రి రవీందర్ రెడ్డి ని పరామర్శించిన నాయకులు*
దాడులు దౌర్జన్యాలు మన సంస్కృతి కాదని స్నేహపూరితమైన వాతావరణంలో గ్రామీణ పల్లెలు ఉండాలని షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు చిలకమర్రి రవీందర్ రెడ్డి పై దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపిటిసిల సంఘం రాష్ట్ర నాయకుడు బాదేపల్లి సిద్ధార్థ డిమాండ్ చేశారు. ఇటీవల హత్యాయత్నానికి గురైన కాంగ్రెస్ నాయకుడు చిలకమర్రి రవీందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ మరో సీనియర్ నాయకుడు బాదేపల్లి సిద్ధార్థ తదితరులు ఆయనను పరామర్శించారు. పెద్ద ఆపద తప్పిందని స్థానికులు స్పందించకపోతే కొంచెం లో ప్రాణం పోయేదనీ అన్నారు. సమాజంలో ఇలాంటి దాడులు సరికావని పేర్కొన్నారు. నిందితుల వెనుక ఎవరు కుట్ర చేశారో పోలీసులు చేదించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని దీని వెనుక ఉన్న కుట్టను విచినం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చిలకమర్రి రవీందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు..