హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించాలి

*హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించిన*

రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

సిద్దిపేట ఆగస్టు 13 ప్రశ్న
ఆయుధం :

బాంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం రోజున గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రపంచంలో హిందువులకు రక్షణ కరువైందన్నారు. హిందువులకు అన్ని విధాల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదవ సోదరులు యెలగందుల రాంచంద్రం, పనిధర్ శర్మ, దూబకుంట ప్రభాకర్, గంగిశెట్టి ఉమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now