ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు..

హైదరాబాద్‌ నగరంలో

 జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అఫ్జల్‌గంజ్‌ నుంచి కుషాయిగూడకు వెళ్తున్న కుషాయిగూడ డిపోనకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓయూ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమకు దారి ఇవ్వలేదనే కోపంతో దుండగులు బస్సును ఆపి డ్రైవర్‌పై దాడికి దిగారు. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్.. దాడికి పాల్పడిన ఆటో ట్రాలీ డ్రైవర్ జాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి జగదీశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఈనెల 20న అప్జల్‌గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌ వైపు వెళ్తున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవ‌ర్ గ‌ణేశ్‌పై కొంతమంది వ్యక్తులు విచ‌క్షణార‌హితంగా దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now