అట్టహాసంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ పథకాలు ప్రారంభం

*అట్టహాసంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ పథకాలు ప్రారంభం*

*లబ్ధిదారులకు అధికారులు పంపిణీ*

*ఇల్లందకుంట జనవరి 26 ప్రశ్న ఆయుధం*

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం రోజున గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని భోగంపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తాసిల్దార్ రాణి, ఎంపీడీవో పుల్లయ్య పాల్గొని మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వినిపించారు అనంతరం అధికారులు మాట్లాడుతూ ఎవరైనా లబ్ధిదారులు అర్హులై ఉండి అందకపోతే తమకు తెలియపరచాలని ప్రజలను కోరారు ఎవరికి ఏ పథకం రాకుండా అధైర్య పడవద్దు అని ఈ పథకం నిరంతర ప్రక్రియ అని తెలిపి ప్రజలకు ధైర్యాన్ని కల్పించారు కొత్త పథకాలైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 16 మందికి, కొత్త రేషన్ కార్డు లు 17 మందికి, ఇందిరమ్మ ఇళ్ళు 104 మందికి రైతు భరోసా భూమి కలిగిన ప్రతి రైతుకు లభిస్తుందని లబ్ధిదారులకు ప్రొసీడింగులను అందజేశారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణ,ఎంపీవో రాజేశ్వరరావు డిప్యూటీ తాసిల్దార్ పార్థసారథి ఆర్ ఐ నాగరాజు ఏపీవో రవి వివిధ శాఖల అధికారులు లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment