కలెక్టరేట్ కార్యాలయం లో మహిళా సిబ్బందిపై హత్యాచారయత్నం
హన్మకొండ జిల్లా:అక్టోబర్ 13
ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు తోటి మహిళా సిబ్బంది అని చూడకుండా అత్యా చారానికి ప్రయత్నించాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది,
హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో తోటి మహిళా సిబ్బందిపై సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ అత్యాచారం చేసేం దుకు ప్రయత్నించారు. నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటే అతనికి పైస్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు.
ఎస్టాబ్లిష్ మెంట్ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా అతడు పని చేస్తున్నారు. ఇర్ఫాన్ సోహెల్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అతడిపై పోలీ సులు లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.