Site icon PRASHNA AYUDHAM

ఆలయ భూమి కబ్జాకు ప్రయత్నం..

ఆలయం కోసం నాలుగు గుంటల భూమి దానం చేసిన వ్యక్తులు 

రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని ప్లాట్లుగా చేస్తున్న వైనం 

అడ్డుకుంటామంటున్న గ్రామస్తులు..

మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో గల వీరాంజనేయ స్వామి గుడికి కొన్ని సంవత్సరాల క్రితం ఆలయం గుడి పక్కనే ఉన్న భూమి యజమానులు ఆలయం కోసం నాలుగు గంటల భూమిని ఆలయానికి దానంగా ఇచ్చారు. ప్రస్తుత ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని మాచారెడ్డి, చుక్కాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఆ భూమి క్రయవిక్రయాలు జరగక నాలుగో వ్యక్తి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి గుడికి గతంలో ఇచ్చిన భూమిని సైతం మాకు ఆన్లైన్లో వచ్చిందని మేము గుడికి ఇచ్చేది లేదని, ప్లాట్లుగా చేసే విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గుడి పక్కనే రెండు ఫ్లాట్ల స్థలం ఉందని ఆ ఫ్లాట్లను ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని గ్రామస్తులు తెలుపుతున్నారు. కాదని ఎవరైనా కొనుగోలు చేస్తే గుడి జాగా కోసం కొట్లాడుతామని వారు పేర్కొంటున్నారు..

Exit mobile version