ప్రభుత్వ హాస్పిటల్ లో హాజరు,ప్రైవేట్ హాస్పిటల్ లో దందా

*ప్రభుత్వ హాస్పిటల్ లో హాజరు,ప్రైవేట్ హాస్పిటల్ లో దందా*

*డాక్టర్ చేగుండ శ్రీనివాస్ పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు*

*స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వ మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన*

*తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము.

*జమ్మికుంట డిసెంబర్ 28 ప్రశ్న ఆయుధం:*

ప్రభుత్వ హాస్పిటల్లో హాజరవుతూ ప్రైవేట్ హాస్పిటల్లో రోగులను తరలిస్తూ దందా చేస్తున్నాడని నేపంతో డాక్టర్ చేగుంట శ్రీనివాస్ పై ప్రభుత్వం చర్యలకు ఆదేశించిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చెల్పూరి రాములు తెలిపారు శనివారం రోజున జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందని సర్కారి వైద్యం ప్రశ్నించినందుకు రాములు పై దురుసు ప్రవర్తన చేసి నానా బూతులు అన్నాడని డాక్టర్ చెగొండ శ్రీనివాస్ పై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ చేగొండ శ్రీనివాస్ డిప్టేషన్ రద్దు చేశామని లెటర్ ద్వారా తెలియజేశారని డిప్టేషన్ రద్దు చెయ్యటమే కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కి, ఫిర్యాదుచేసిన వెంటనే స్పందించిన (సీఎంఓ )సీఎం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెంటనే హుజురాబాద్ ప్రాంతీయ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ చెగొండ శ్రీనివాస్ తన డ్యూటీ సమయంలో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు వేసుకున్న తర్వాత డబ్బు సంపాదన ద్వేయంగా పేద ప్రజల రోగుల ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా తన డ్యూటీని వదిలిపెట్టి వారి సొంత హాస్పటల్ అయినటువంటి జమ్మికుంట లోని వరుణ్ సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో ఓపి చూస్తున్నారని.

IMG 20241228 WA0085

వెంటనే స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ చెగొండ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోని అతనిని రెండు నుండి ఐదు సంవత్సరాల వరకు మెడికల్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్(రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) ACT, 2010 ప్రకారం లైసెన్స్ రద్దుచేసి విధుల నుండి తొలగించి తగు చర్యలు తీసుకుని నాకు న్యాయం చెయ్యగలరని ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి NO.10925/GEN-GP/2024-సీఎంఓ ఫిర్యాదు పై స్పందించి డాక్టర్ చేగొండ శ్రీనివాస్ పై ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఫిర్యాదుదారునికి వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుండి లెటర్ రావడం జరిగిందని స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్ అత్యంత ప్రాధాన్యత కింద ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన పిటిషన్ తీసుకున్న చర్యను15 రోజుల కాలవ్యవధిలో అప్డేట్ చెయ్యాలని అభ్యర్థనతో తదుపరి చర్య తీసుకుంటామని శనివారం రోజున లెటర్ రావడం జరిగినదని ఇంత త్వరగా రాములు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రజా ప్రభుత్వ మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాము అన్నారు

Join WhatsApp

Join Now