యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త.
ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్లపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఇలాంటి మెసేజ్లు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ‘ఆధార్ అప్డేట్ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ చాలా మందికి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయన్నారు. ఆ మెసేజ్లోని లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లి అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరించారు.