తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ఆడియో క్యాసెట్ రిలీజ్

IMG 20240820 WA2535

సినీ సంగీత దర్శకులు, మెలోడీ మాస్టర్ మరియు కొత్తగూడెం కళామతల్లి ముద్దుబిడ్డ గంటాడి కృష్ణ స్వీయ నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు, సంగీతాన్ని సమకూరుస్తున్న నూతన చిత్రం” రిస్క్ఏ గేమ్ ఆఫ్ యూత్ యొక్క టీజర్ విడుదల!

 

హైదరాబాదులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ హీరో సాయిరాం శంకర్ మరియు ప్రముఖ సినీ నిర్మాత నటులు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల గణేష్

ఈ చిత్రంలో నూతన గీతాన్ని రాస్తున్న ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉన్నారు.

 

అన్ని తరగతుల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నిర్మితమైన” రిస్క్” చిత్రం పెద్ద హిట్ అవ్వాలి!

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క కోరారు.

 

ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ 20 సంవత్సరాల క్రితం అద్భుతంగా సంగీతాన్ని అందించి విశ్వవ్యాప్తంగా ఆ బాల గోపాలన్ని అలరించిన చిత్రం

6 టీన్స్ సూపర్ హిట్. అందులో “దేవుడు వరమందిస్తే “అనే గీతం విశ్వవ్యాప్తంగా సూపర్ హిట్ అయి వేరే భాషల్లోకి కూడా అనువదింపబడింది.

సినిమాకి సీక్వల్ గా గంటాడి నిర్మాతగా దర్శకుడిగా సంగీత దర్శకుడిగా బహుముఖ పాత్రలు నిర్వహిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన చిత్రమే “రిస్క్”, ద గేమ్ ఆఫ్ యూత్ యొక్క టీజర్ ను ఇటీవల హైదరాబాదులోని తన స్వగృహమైన ప్రజా భవలో భట్టి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

 

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ

మా భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం ఉమ్మడి జిల్లాల కళామతల్లి ముద్దుబిడ్డ ప్రముఖ సినీ సంగీత దర్శకులు గంటాడి కృష్ణ నిర్మిస్తున్న” రిస్క్” చిత్రం యొక్క టీజర్ తాను చూడడం జరిగిందని

మంచి కథ ఎమోషన్ తో పాటు యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే లవ్ ఎంటర్టైన్మెంట్గా కొనసాగుతుందని , అంతేగాక ఇందులోని పాటలన్నీ

మెలోడీని మేళవించి క్యాచి ట్యూన్స్ తో అద్భుతంగా ఉన్నాయని

అంతేగాక నా బాల్యమిత్రుడు కళాశాల మిత్రుడు

ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఒక గీతాన్ని కూడా రాయడం ఆనందదాయకమని , అందువలన ఈ సినిమా ఆర్థికపరంగా లాభాలను పండించి అటు గంటాడి కృష్ణ ఇటు మద్దెల శివకుమార్, అంతేగాక యూనిట్ మొత్తానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు

 

ఈ సందర్భంగా శ్రీ గంటాడి కృష్ణ  ప్రతిస్పందిస్తూ

నా అభిమాన ప్రజా నాయకుడు, నిత్య కృషివలుడు అంబేద్కర్ ఆశయాల వారసుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మా మానస పుత్రిక” రిస్క్ “చిత్రం యొక్క టీజర్ రిలీజ్ కావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని,ఈ చిత్రంలో సందీప్ అశ్వ, సానియా ఠాకూర్ జోయా జవేరి నూతన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని, రాజీవ్ కనకాల అనీష్ కురవల్లి లాంటి సీనియర్ దిగ్విజయలు నటిస్తున్నారని బహుముఖ సన్నిహిత వర్గాల ప్రేక్షకులను అలరించిo ది,గంటాడి కృష్ణ , ప్రముఖ సినీ హీరో సాయిరాం శంకర్, ప్రముఖ సినీ నిర్మూత నటులు రాజకీయ నాయకులు , బండ్ల గణేష్., చిత్ర హీరో శ్రీ సందీప్ అశ్వ , సినీ గీత రచయిత ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సుస్వరాల సుమధురాలగాన కోకిల మతి ఆమని ,ఉగ్ర నరసింహులు, ఆదర్శ ఫౌండేషన్ అధినేత సమాజసేవకులు కుసుమ భోగరాజు , సాయి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now