హైదరాబాద్ వాసులకు ఆగస్టు 15 కానుక.. రూ.5కే, 6వెరైటీలు

హైదరాబాద్ వాసులకు ఆగస్టు 15 కానుక.. రూ.5కే, 6వెరైటీలు

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనుంది. పేద ప్రజల కోసం ఉదయం పూట కేవలం రూ.5కే టిఫిన్ అందించనున్నారు. నగరంలో చాలా మంది పేద, మధ్యతరగతి వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్యాంటీన్లలో ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి వివిధ రకాల అల్పాహారాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు కానుండగా, మిగిలిన మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ భరించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం..తెలంగాణలోని రేవంత్ సర్కార్.. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కీలక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. అలానే రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ , వరంగల్, కరీనంగర్, ఆదిలాబాద్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఆయా పట్టణాల్లో రోడ్ల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణం, విమానాశ్రయాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈక్రమంలో ఆగస్టు15 నాడు రాజధాని ప్రజలకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు హైదరాబాద్ వాసుల కోసం అద్భుతమైన పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు.

Join WhatsApp

Join Now

Leave a Comment