పంట డబ్బుల కోసం అత్తను హత్య చేసిన అల్లుడు అరెస్ట్ మరియు రిమాండు కు తరలిపు*  

*• పంట డబ్బుల కోసం అత్తను హత్య చేసిన అల్లుడు అరెస్ట్ మరియు రిమాండు కు తరలిపు*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

 

తేది 03.07.2025 నాడు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జిన్న రాజు అను వ్యక్తి తన తల్లి అయిన జిన్నా లక్ష్మీ W/o నరేందర్, వయస్సు 50 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం తన అల్లుడు యగు జిన్న బాగరాజునకు లక్ష రూపాయలు, అప్పుగా ఇచ్చినది, తను ఎన్ని సార్లు అడిగిన తిరిగి ఇవ్వడం లేదు. అయితే బాగరాజు తను పండించిన జొన్నల డబ్బులను తన అత్త అయిన లక్ష్మీ, అకౌంటు లో వేయించినాడు. బాగరాజు, జొన్నల డబ్బులు అడిగితే, తనకు ఇవ్వవలసిన బాకీ కింద జమ, కట్టుకుకుంటాను డబ్బులు ఇవ్వను అని లక్ష్మీ అనగా, బాగరాజు తన అత్త పై కక్ష పెంచుకొని ఎలాగైనా తన అత్త లక్ష్మీని చంపాలని పథకం పన్ని, స్కూల్ వంట పని ముగించుకొని ఒంటరిగా వస్తున్న తన అత్తపై కమ్మకత్తితో మెడపై దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేశాడు. కావున తగు చర్య నిమిత్తం దరఖాస్తు ఇవ్వగా పిట్లం పోలీస్ వారు Cr.No. 108/2025 U/Sec 103(1) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించినారు.

ఘటన జరిగిన రోజున నిందితుడు బాగరాజు, తన మోటార్ సైకిల్ పై హత్యలో ఉపయోగించిన మారణాయుధం (కమ్మ కత్తి)తో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

ఈ కేసులో డీఎస్పీ, బాన్సువాడ పర్యవేక్షణలో సీఐ బాన్సువాడ రూరల్ రాజేష్, ఎస్‌ఐ పిట్లం రాజులు, సరియగు ఆధారాలు సేకరించి, నిందితుడి వద్ద నుండి హత్య చేయడానికి ఉపయోగించిన వాటిని స్వాధీన పరచుకొని, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపనైనది. ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి, జుడిషియల్ రిమాండ్ నకు పంపడమైనది.

నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరములు ,

1.ఒక కమ్మ కత్తి 2. ఒక మోటార్ సైకిల్ 3. ఒక సెల్ ఫోన్ 4. నిందితుడు మరియు మృతురాలి బట్టలు ఇట్టి కేసులో, అన్ని ఆధారాలను అతి తక్కువ సమయంలో సేకరించి, నేరస్తుడు అయిన బాగరాజు ను అరెస్టు చేసి జుడిసియల్ రిమాండ్ నకు తరలించిన DSP బాన్సువాడ, బాన్సువాడ రూరల్ సి ఐ రాజేష్ మరియు పిట్లం SI రాజులను, జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ అభినందించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment