మాజీ మంత్రి మల్లారెడ్డితో ఆస్ట్రేలియన్ ప్రతినిధుల కీసర పర్యటన

*మాజీ మంత్రి మల్లారెడ్డితో ఆస్ట్రేలియన్ ప్రతినిధుల కీసర పర్యటన*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూన్ 8

మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆస్ట్రేలియన్ ప్రతినిధులతో కలిసి కీసర మండలంలో పర్యటించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యులు షినా వాట్, లి టార్లమిస్ తో కూడిన ఈ ప్రతినిధి బృందం కీసర గ్రామాన్ని సందర్శించింది.

పర్యటనలో భాగంగా, కీసర చౌరస్తాలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కీసర గుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మాజీ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now